Corona Virus: జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చే సందర్శకులపై ఆంక్షలు

Corona Virus: జీహెచ్ఎంసీ లోని పలు విభాగాల్లో పాజిటివ్ కేసులు నమోదు..జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి.

Update: 2021-03-27 14:29 GMT

హైదరాబద్ ఆంక్షలు 

Corona Virus: హైదరాబాద్ లో కరోనా కేసులు మళ్ళి పెరుగుతున్నాయి. దీనితో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సందర్శకులపై ఆంక్షలు విధించారు. పెరుగుతున్న కోవిద్ పాజిటివ్ కేసుల నియంత్రణ చర్యల్లో బాగంగా జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంతో పాటు రోజురోజుకు నగరంలో పెద్దఎత్తున కొత్త కేసులు నమోదవుతునందున జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చే సందర్శకులపై ఆంక్షలు విధిస్తున్నట్టు జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ లోని పలు విభాగాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అధికారులు, సిబ్బంది, సాధారణ ప్రజానీకం శ్రేయస్సు దృష్ట్యా ఈ పాక్షిక ఆంక్షలు ప్రవేశ ట్టుతున్నట్లు ప్రకటించింది. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది కూడా మాస్కులు ధరించి, భౌతిక దూరం, హ్యాండ్ వాష్ విధిగా చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చే సందర్శకులు, బిల్డర్లు, కాంట్రాక్టర్ల సందర్శనపై కూడా ఈ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.

అయితే ఏదైనా ఫిర్యాదులు, విజ్ఞప్తులు ఉంటే మై-జీహెచ్ఎంసీ యాప్ ద్వారా చేయాలని, లేదా సందర్శన సమయంలో కార్యాలయ భవనం ప్రవేశ ద్వారం వద్ద నున్న గ్రీవిఎన్స్ సెల్ లో దారఖాస్తులు అందచేయాలని చెబుతున్నారు. జీహెచ్ఎంసీలో జరిగే అధికారిక సమాచారాన్ని సీపీఆర్ఓ ద్వారా పత్రికా ప్రతినిధులకు అందచేయడం జరుగుతుందని తెలిపారు.

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పలువురికి కోవిద్ పాజిటివ్ వచ్చినందున ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పాక్షికంగా పై నియంత్రణ చర్యలను చేపట్టినట్లు, దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని జీహెచ్ఎంసీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

Tags:    

Similar News