ఆర్వోబీ, ఆర్‌యూబీలపై జీహెచ్‌ఎంసీ ఫోకస్

GHMC Focus: *10 రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఆర్వోబీ, ఆర్‌యూబీలు

Update: 2022-06-17 02:34 GMT

ఆర్వోబీ, ఆర్‌యూబీలపై జీహెచ్‌ఎంసీ ఫోకస్ 

GHMC Focus:  హైదరాబాద్‌లో సాఫీ ప్రయాణానికి జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తోంది. జర్నీకి అడ్డుపడే రైల్వే గేట్లపై ఫోకస్ పెట్టింది. రైల్వే ట్రాక్‌ల వద్ద గేట్ పడకుండా ప్రత్యేకంగా రహదారి ఏర్పాటు చేస్తున్నారు. రైలు పట్టాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్మాణం చేయాలనుకుంటున్న రైల్వే అండర్ బ్రిడ్జి ఆర్ యూ బి, రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్వోబి నిర్మిస్తున్నారు.

హైదరాబాద్ లో సిగ్నల్ పడకుండా ప్రయాణం చేయాలంటే సాధ్యం కాదు. ట్రాఫిక్ జంక్షన్ ల దగ్గర సిగ్నల్ లతో ఆగుతూ వెళుతుంటే...రైల్వేపట్టాల దగ్గర ఆగడం మరో ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నూతన ప్రాజెక్టులు చేపడుతోంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు ఎస్ఆర్డీపీ ద్వారా ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఎన్నో ఏళ్లుగా రైల్వే క్రాసింగ్ వద్ద వాహనదారులు, పాదాచారులు పడుతున్న కష్టాలకు శాశ్వత చెక్ పెట్టాలని తాజాగా నిర్ణయించారు. కొత్తగా ఆర్ యూబీలు, ఆర్వోబీలపై ప్రధానంగా జీహెచ్ఎంసీ దృష్టి సారించింది.

10 రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద 1230 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జి , రోడ్ అండర్ బ్రిడ్జిలను నిర్మించాలన్న ప్రతిపాదిత ప్రాజెక్టులను కార్యరూపంలోకి తీసుకువచ్చేలా తాజాగా ఇంజనీరింగ్ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. 10 చోట్ల రైల్వే శాఖ సమన్వయంతో చేపట్టనున్న ప్రాజెక్టులకు మొదట ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉండేలా ఆర్ యూబీలపై దృష్టి సారించారు. ఈ మేరకు పలుచోట్ల చేపట్టే ఆర్ యూబీలపై టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు భూ సేకరణపై అధ్యయనం చేసి ఇంజినీరింగ్ విభాగానికి నివేదిక అందజేశారు. డిటెల్ట్ ప్రాజెక్టు రిపోర్టు డీపీఆర్ రూపకల్పనపై ఇంజినీరింగ్ విభాగం అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

నార్త్ జోన్ పరిధిలో 10 చోట్ల ఆర్‌యూబీ, ఆర్వోబీలు ఏర్పాటు చేయనున్నారు. ఆర్పీఎస్ ట్రైనింగ్ సెంటర్-మౌలాలి, మల్కాజిగిరి , మౌలాలి స్టేషన్ మెట్టుగూడ ఆర్వోబీ విస్తరణ, పాటిగడ్డ ఆర్వో, మాణికేశ్వరీ నగర్ , బొల్లారం-గుండ్ల పోచంపల్లి స్టేషన్. అల్వాల్ వెంకటాపురం, ఓల్డ్ అల్వాల్ ప్రాంతాల్లో నిర్మాణాలు చేయడానికి ప్రతిపాదనలు పంపుతున్నారు.

Tags:    

Similar News