GHMC Elections 2020: రెబల్స్ ను బుజ్జగించడంలో పార్టీలు సక్సెస్

GHMC Elections 2020: * మెజారిటీ డివిజన్లలో వెనక్కి తగ్గిన రెబల్స్ * టీఆర్‌ఎస్‌ తరఫున రంగంలోకి కేటీఆర్‌ * నామినేటెడ్‌ పోస్టులుంటాయని భరోసా * బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ మంత్రాంగం * కాంగ్రెస్‌లో రంగంలోకి అగ్రనేతలు * పలు చోట్ల బరిలో నిలిచిన రెబల్స్‌ * అభ్యర్థుల వివరాలు అధికారికంగా వెల్లడించని జీహెచ్‌ఎంసీ అధికారులు

Update: 2020-11-23 04:33 GMT

GHMC Elections 2020

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోవడంతో బరిలో నిలిచిన అసంతృప్తులను బుజ్జగించి నామినేషన్లను ఉపసంహరింపజేయడంలో ప్రధాన పార్టీల నేతల ప్రయత్నాలు చాలావరకు ఫలించాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడువు నిన్నటితో ముగిసింది. చివరి రోజున రెబెల్ అభ్యర్థులకు నచ్చచెప్పేందుకు ఆ పార్టీల అగ్ర నేతలు రంగంలోకి దిగారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పలువురు అసంతృప్తులతో నేరుగా చర్చించారు. పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని.. నామినేటెడ్‌ పోస్టులు, ఇతర అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

బీజేపీ రెబల్స్‌ను బుజ్జగించేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీనియర్ నేత కె.లక్ష్మణ్‌ రంగంలోకి దిగారు. గోషామహల్‌లోని మెజారిటీ డివిజన్లలో పార్టీ నుంచి రెబల్స్‌ బరిలో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్‌ వర్గానికి అవకాశం రాకపోవడంతో.. ఆయన అనుచరులు నామినేషన్లు వేశారు. బీ-ఫారం సమర్పించిన వారిని, పార్టీ అభ్యర్థులుగా.. పార్టీ పేరిట నామినేషన్‌ వేసి బీ-ఫారం ఇవ్వని వారిని స్వతంత్ర అభ్యర్థులుగా రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించారు. బీజేపీ నుంచి అత్యధికంగా 539 నామినేషన్లు, టీఆర్‌ఎస్‌ నుంచి 527, కాంగ్రెస్‌ నుంచి 348 నామినేషన్లు దాఖలయ్యాయి.

గ్రేటర్‌లోని 150 డివిజన్ల నుంచి 18 వందల 93 మంది.. 2వేల 575 నామినేషన్లు వేశారు. పలు కారణాలతో 67 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. హైకోర్టు ఆదేశాలతో కూన శ్రీనివా్‌సగౌడ్‌ నామినేషన్‌ ను పరిగణనలోకి తీసుకున్న రిటర్నింగ్‌ అధికారి ఆయనకు గుర్తు కేటాయించారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో 42 మంది బరిలో ఉన్నారు.

ఉప్పల్‌ నియోజకవర్గంలోని 10 డివిజన్లలో 66 మంది బరిలో ఉన్నారు. మల్లాపూర్‌లో అత్యధికంగా 10 మంది పోటి చేస్తున్నారు.

యాతక్‌పురాలోని 6 డివిజన్లలో 43 మంది పోటిలో ఉన్నారు. గోషామహల్‌ నియోజకవర్గంలో ఆరు డివిజన్లలో 64 మంది బరిలో నిలిచారు. బీజేపీ నుంచి పలు డివిజన్లలో రెబల్‌ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని 9 డివిజన్లలో 167 మంది నామినేషన్లు వేయగా.. 63 మంది ఉపసంహరించుకోవడంతో 104 మంది బరిలో నిలిచారు.

ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని 65 డివిజన్ల నుంచి 71 నామినేషన్లు దాఖలు కాగా.. 24 మంది ఉపసంహరించుకున్నారు. దీంతో 47మంది బరిలో ఉన్నారు. అత్యధికంగా రాంనగర్‌ డివిజన్‌ నుంచి 14 మంది బరిలో నిలిచారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని 8 డివిజన్లలో 65 మంది బరిలో ఉన్నారు. అత్యధికంగా కేపీహెచ్‌బీ, ఓల్డ్‌ బోయిన్‌పల్లి డివిజన్ల నుంచి 11 మంది చొప్పున పోటి చేస్తున్నారు.

Tags:    

Similar News