Hyderabad: నేటి నుంచి హైదరాబాద్‌లో జీ-20 సమావేశాలు.. వ్యవసాయం.. అనుబంధ రంగాల అంశాలపై చర్చ

Hyderabad: సదస్సుకు హాజరు కానున్న 200కు పైగా ప్రతినిధులు

Update: 2023-06-15 07:35 GMT

Hyderabad: నేటి నుంచి హైదరాబాద్‌లో జీ-20 సమావేశాలు.. వ్యవసాయం.. అనుబంధ రంగాల అంశాలపై చర్చ

G-20 summit 2023: నేటి నుంచి హైదరాబాద్‌లో G-20 దేశాల అగ్రికల్చరల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశం ప్రారంభమయ్యింది. ఈనెల 17వరకు జరిగే సమావేశాల్లో జీ20 దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు పాల్గొంటున్నారు. వీరితో పాటు జీ20 దేశాల సభ్యులు, అంతర్జాతీయ సంస్థల నుంచి 200మందికి పైగా ప్రతినిదులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, అంతర్జాతీయ సంస్థల డైరెక్టర్ జనరల్‌లు హాజరవుతున్నారు.

మొదటి రోజు కేంద్ర సహాయ మంత్రి కైలాష్ చౌదరి ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలలో భారతదేశం సాధించిన విజయాలను ప్రదర్శించారు. ప్రారంభోత్సవం తర్వాత వ్యవసాయ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. సదస్సులో అగ్రి బిజినెస్‌ ప్రజలు, ప్లానెట్‌కు లాభదాయకంగా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై ప్రతినిదులు చర్చంచనున్నారు. అదేవిధంగా వ్యవసాయంలో డిజిటల్ టెక్నాలజీ శక్తిని వినియోగించుకోవడం అనే అంశంపై ఈవెంట్‌లు నిర్వహిస్తారు. ఇందులో అగ్రశ్రేణి భారతీయ వ్యవసాయ-ఆధారిత కంపెనీలు పాల్గొంటాయి. అగ్రి-బిజినెస్ కంపెనీల ప్రమోషన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల తరపున ప్రభుత్వాధికారులు పాల్గొంటున్నారు.

రెండో రోజు G20 సమావేశంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వ్యవసాయ మంత్రులు,ఇతర ప్రతినిధి బృందం పాల్గొంటుంది. రెండో రోజు సమావేశాల్లో ఆహార భద్రత, పోషకాహారం కోసం సుస్థిర వ్యవసాయంపై చర్చలు జరుగాతాయి. మూడు సమాంతర సెషన్‌లలో మహిళల నేతృత్వంలోని వ్యవసాయం, స్థిరమైన జీవవైవిధ్యం, వాతావరణ పరిష్కారాలపై ఉన్నత స్థాయిలో మంత్రుల చర్చలు ఉంటాయి.

మూడవ రోజు మంత్రుల సమావేశంలో వ్యవసాయ వర్కింగ్ గ్రూప్, G20, ఇండియన్ ప్రెసిడెన్సీ తీర్మానాలను ఆమోదించడంతో సదస్సు ముగుస్తుంది. ఆ తర్వాత ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్‌ను సందర్శించనున్నారు.  

Tags:    

Similar News