Yadadri Bhuvanagiri: చిన్నారి ప్రాణాలు తీసిన రూ.5 కాయిన్..

Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

Update: 2022-07-06 10:45 GMT

Yadadri Bhuvanagiri: చిన్నారి ప్రాణాలు తీసిన రూ.5 కాయిన్..

Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ ఐదు రూపాయల నాణెం మింగిన నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. భూదాన్ పోచంపల్లిలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు సరిత- మహేష్‌ దంపతుల కుమార్తె చైత్ర(4) ఎల్‌కేజీ చదువుతోంది. వారం రోజుల క్రితం ఆమె ఐదు రూపాయల నాణెం మింగింది. తీవ్రంగా ఏడుస్తుండటంతో చైత్రను తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు పాపకు చికిత్స చేసి నాణెం తొలగించారు. దీంతో కుటుంబసభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఇంటికి పంపించారు. అయితే చిన్నారి సోమవారం అస్వస్థతకు గురై శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ నేప‌థ్యంలో తల్లిదండ్రులు చైత్రను అదే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. అయితే కాయిన్ ఇరుక్కోవడం వల్ల గొంతులో ఇన్‌ఫెక్షన్ సోకి చిన్నారి మరణించి ఉండొచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు. కంటికి రెప్పలా సాకుకొంటున్న చిన్నారి అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబం పెను విషాదంలో అలుముకొంది.

Tags:    

Similar News