ఆ తండ్రికి ఆరుగురు కూతుళ్లు. పేదరికం కారణంగా పెళ్లిళ్లు జరగడంలేదు. కానీ, ఓ సోదరి పరీక్ష రాయడానికి వెళ్లి ప్రేమికుడితో వెళ్లిపోయింది. చెల్లెలు చర్యతో తమ తండ్రి పరువుపోయిందని నలుగురు అక్కాచెల్లెళ్లు భావించారు. పరుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆసుపత్రిలో ప్రాణపాయంతో చికిత్స పొందుతున్న ఈ నలుగురు యువతులు సొంత అక్కాచెల్లెళ్లు. తమ సోదరి ఒకరు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడంతో తమ తండ్రి పరువుపోయిందని భావించి వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య, సాయమ్మ దంపతులకు వెంకటమ్మ, అనిత, కృష్ణవేణి, యాదమ్మ, ప్రవళిక, స్వాతి అనే ఆరుగురు కూతుళ్లు ఉన్నారు. పెళ్లీడుకు వచ్చిన వీరికి పేదరికం కారణంగా పెళ్లి జరగడంలేదు. ఐదో సోదరి ప్రవళిక పరీక్ష రాయడానికి వెళ్లి ప్రేమికుడితో వెళ్లిపోయింది. ప్రియుడితో తమ సోదరి వెళ్లిపోవడంతో తమ తండ్రి పరువుపోయిందని మిగతా అక్కాచెల్లెళ్లు భావించారు. ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఎంతకీ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కలవారు వచ్చి ఇంటి తలుపులను పగులగొట్టారు. ప్రాణపాయస్థితిలోనున్న నలుగురు అక్కాచెల్లెళ్లను మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. బాధితుల తల్లి కన్నీరు మున్నీరుగా రోధించింది. తండ్రి పరువుకోసం ఆత్మహత్యాయత్నం చేసిన నలుగురు అక్కాచెల్లెళ్ల ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.