KTR: పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

KTR: ఎక్స్ వేదికగా రేవంత్‌పై మండిపడ్డ ఎమ్మెల్యే కేటీఆర్

Update: 2024-06-25 15:45 GMT

KTR: పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

KTR: పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి వైఖరి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారంలో నీతులు చెప్పి.. ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులు చేస్తారా అని ప్రశ్నించారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమని... ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమన్నారని గుర్తుచేసారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టిచంపమన్నారని... మరి ఇవాళ మీరు చేస్తోందేంటి అని నిలదీశారు. ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని అని అడిగారు. రాజకీయంగా గోరి కట్టాల్సింది ఎవరికి అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పి కప్పదాట్లను ప్రోత్సహిస్తారా అని మండిపడ్డారు. ఏ ఎమ్మెల్యేనైనా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే... రాళ్లతో కొట్టించే బాధ్యతను రేవంత్ తీసుకుంటా అన్నారని.... కావున జవాబు చెప్పాల్సింది సైతం ఆయనే అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు కేటీఆర్.


Tags:    

Similar News