Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు లేఖ

Harish Rao: LRS స్కీమ్‌ ఉచితంగా అమలుచేయాలని కోరిన హరీష్‌రావు

Update: 2024-08-26 09:32 GMT

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు లేఖ

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం, ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయాలని కలెక్టర్ స్థాయి నుంచి పంచాయతీ సెక్రెటరీ వరకు ఉన్న యంత్రాంగం మీద తీవ్ర ఒత్తిడి చేస్తుందని ఆరోపించారు. పంచాయతీ సెక్రెటరీలు, బిల్ కలెక్టర్లు రోజుకు మూడు నాలుగు సార్లు ఫోన్లు చేస్తూ ప్రజలను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఫీజులు చెల్లించకుంటే లేఅవుట్లు రద్దు చేస్తామంటూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని.. టార్గెట్లు పెట్టి మరీ 15వేల కోట్ల రూపాయలు వసూళ్లు చేయాలని ఆదేశాలివ్వడం ప్రజల రక్తమాంసాలను పీల్చడమే అన్నారు హరీష్ రావు.

ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చాక ఎందుకు దోపిడీ చేస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాట తప్పిన ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఏ ఒక్కరూ ఒక్క రూపాయి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించవద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిన హరీష్ రావు.. ప్రభుత్వం మెడలు వంచి ఎల్ఆర్ఎస్‌ను ఉచితంగా అమలు చేయించే బాధ్యత బిఆర్ఎస్ తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News