Rythu Runamafi: రైతులకు గుడ్ న్యూస్..నేడే రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల..రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు మాఫీ

Rythu Runamafi: నేడు రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల అవ్వనున్నాయి. ఈ నిధులను అసెంబ్లీ ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిలీజ్ చేయనున్నారు.

Update: 2024-07-29 23:40 GMT

 Rythu Runamafi : రైతులకు గుడ్ న్యూస్..నేడే రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల..రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు మాఫీ

Crop Loan:తెలంగాణలోని రైతులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పనుంది ప్రభుత్వం. నేడు రెండో విడత రుణమాఫీ ప్రారంభించుంది. లక్షన్నర రూపాయల వరకు రుణాల మాఫీని అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు. రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు రూ. 7వేల కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది. మూడు విడతల్లో రుణమాఫీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేసిన విషయం తెలిసిందే.

ఈనెల 19న మొదటి విడత ప్రారంభించింది. మొదటి విడతలో సుమారు 10.83 లక్షల కుటుంబాలకు చెందిన పదకొండున్నర లక్షల ఖాతాల్లో రూ. 6వేల కోట్లు జమ కానున్నాయి. ఆధార్ నెంబర్, ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో సుమారు 17వేల మందికి రుణమాఫీ డబ్బులు జమ కాలేదు. మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలను ఆగస్టు 15వ తేదీలోకా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక లోసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 2లక్షల్లోపు పంటరుణాలన్నీ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కల్వకుర్తి సభలో తెలిపారు. హరీశ్ రావు ఆగస్టులోపు రుణమాఫీ చేయాలన్న సవాల్ ను స్వీకరించి మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతగా రైతుల ఖాతాల్లో రూ. 6,093 కోట్లను జమ చేశామన్నారు. రెండోవిడతలో రూ.లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. మూడో విడతలో రూ. 2లక్షల వరకు రుణమాఫీ చేసి మూడు విడతల్లో రూ. 31వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కేవలం పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News