Rangareddy: ఒక్కో సర్టిఫికెట్‌ కోసం రూ.50వేలు నుంచి లక్ష.. MRO ఆఫీసులో భారీ స్కామ్..

Rangareddy: రంగారెడ్డి జిల్లా మంచాల MRO ఆఫీసులో భారీ స్కామ్ బయటపడింది.

Update: 2024-07-01 07:26 GMT

Rangareddy: ఒక్కో సర్టిఫికెట్‌ కోసం రూ.50వేలు నుంచి లక్ష.. MRO ఆఫీసులో భారీ స్కామ్

Rangareddy: రంగారెడ్డి జిల్లా మంచాల MRO ఆఫీసులో భారీ స్కామ్ బయటపడింది. ఇష్టానుసారగా క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లు జారీ చేస్తూ పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. ఉన్నత చదువుల కోసం ప్రభుత్వ పథకాల కోసం తప్పుడు దారిలో ఇన్‌కమ్ సర్టిఫికెట్లు పొందినట్టు గుర్తించారు. అవసరాన్ని బట్టి ఒక్కో సర్టిఫికెట్ కోసం రూ. 50 వేల నుంచి లక్ష వరకూ సొమ్ముచేసుకున్నట్టు తెలుస్తుంది.

MRO డిజిటల్ సంతకంతో అవినీతికి పాల్పడినట్టు తెలుస్తుంది. డిస్ట్రిక్ట్ మైనారిటీ ఆఫీస్‌నుంచి లెటర్ రావడంతో అధికారులు పరిశీలించగా దొంగ ముఠా బాగోతం బయటపడింది. తీగలాగితే డొంకంతా కదిలినటు వందల అర్జీదారులు ఎవరనేది ఎంక్వయిరీ చేయాగా వారంతా నాన్ లోకల్ అని తేలింది. అప్లికేషన్లు కుప్పులు తెప్పలుగా ఉండటంతో అధికారులే కంగుతిన్నారు. స్కామ్‌కు పాల్పడినవారు మంచాల తాసిల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సురేష్, స్థానిక మీ సేవ ద్వారా దరఖాస్తులు చేసిన రవిపై మంచాల పోలీసు స్టేషన్లో తహశీల్దార్ ఫిర్యాదు చేశారు. నిందితులపై 420, 409 సెక్షన్ల కింద కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. ఈ స్కామ్‌‌లో ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఈ విషయం బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచుతున్నారు. ఈ విషయంపై స్థానిక తహసిల్దార్‌ను వివరణ కోరగా.. పై అధికారుల అనుమతి లేనిది ఎలాంటి వివరణ ఇవ్వలేనని తెలిపారు.

అనుమానం రాకుండా వేరొక పేరుతో లాగిన్ అయ్యి వేర్వేరు ఫోన్ నెంబర్లతో భారీ మొత్తంలో స్కామ్ కు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే స్థానికేతరులకు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ చెయాడంపై ఉన్నతాధికారుల ఆగ్రహం చేశారు. మొత్తం 3 ఫోన్ నెంబర్లతో ఇన్‌కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు తయారు చేసి అర్జీదారులు లేకుండానే సర్టిఫికెట్లు విడుదల చేసి నేరుగా ఇంటికే పంపిస్తున్నట్టు తేలింది. ఈ స్కామ్‌లో కొంత మంది ముఠాగా ఎర్పడి స్థానిక మీసేవ కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లోని పలు మీసేవ కేంద్రాల ద్వార దరఖాస్తు చేసిన అర్జిదారులకు ఈ సర్టిఫికెట్లు అమ్మినట్టు తెలుస్దుంది. సర్టిఫికెట్ జారీలో VRA, DT, RI ల రిపోర్టు ప్రమేయం లేకుండానే గత ముడు నెలలు గా వ్యవహారం గుట్టుచప్పుడుగా నడుస్తున్నట్టు తెలుస్తుంది. 

Full View


Tags:    

Similar News