హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో భూప్రకంపనలు

Update: 2021-01-13 10:31 GMT

హైదరాబాద్ లో మరోసారి భూమి కంపించింది. కూకట్‌పల్లి ఆస్బెస్టాస్ కాలనీలో ఉదయం తొమ్మిదిన్నర సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. దాంతో, స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాలనీవాసులు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకి పరుగులు తీశారు. నాలుగు సెకన్ల పాటు భారీ శబ్దంతో వైబ్రెషన్స్‌ వచ్చాయని స్థానికులు తెలిపారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చామని కాలనీవాసులు వెల్లడించారు. ఇక భూమి కంపించడానికి గల కారణాలు తెలుసుకోవాలిసిదిగా స్థానికులు అధికారులను కోరుతున్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు వస్తున్నాయి. అక్టోబర్‌లో కూడా ఇలాగే భూ ప్రకంపనలు వచ్చాయి. అక్టోబర్ ‌లో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. వనస్థలిపురం, బీఎన్‌ రెడ్డి నగర్‌, వైదేహి నగర్‌ తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఒక సెకండ్‌ పాటు భూమి కంపించడంతో శబ్ధాలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరిగెత్తారు. ఇలా వరుసగా మూడుసార్లు భూమి కంపించడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News