Telangana: డీఎస్సీ ఆందోళన తీవ్రరూపం.. అర్ధరాత్రి రోడ్డెక్కిన నిరుద్యోగులు.. పలువురి అరెస్ట్

DSC Exam: తెలంగాణలో డీఎస్సీ పరీక్ష వ్యవహరం రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. డీఎస్సీని వాయిదా వేయాలంటూ అర్ధరాత్రి వరకు నిరసనలు మిన్నంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ సహా హైదరాబాద్ సిటీలో పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు.

Update: 2024-07-14 05:03 GMT

DSC Exam: తెలంగాణలో డీఎస్సీ పరీక్ష వ్యవహరం రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. డీఎస్సీని వాయిదా వేయాలంటూ అర్ధరాత్రి వరకు నిరసనలు మిన్నంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ సహా హైదరాబాద్ సిటీలో పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు చేపట్టారు. దిల్ షుఖ్ నగర్ లో నిరుద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. రాజీవ్ చౌక్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రీ నిరుద్యోగి ఇంటింటికి ప్రచారం చేసి గెలిపించుకున్నందుకు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి సైరైంది కాదని.. వెంటనే స్పందించి ప్రభుత్వ కొలువులకు సిద్ధం అయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగుల ఆందోళన పట్ల ప్రభుత్వం సానూకూలతతో డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించనట్లయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని.. చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతామన్నారు. ఉద్యోగాలు వస్తాయని మేనిఫెస్టోలో చూస కాంగ్రెస్ ను గెలిపించుకుంటే ..అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం చేస్తారనుకోలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ పరీక్ష రోజున హాల్ టికెట్లు చింపి వేసి నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ...అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఒకటో తేదీన వేతనాల చెల్లింపు ఉత్తమాటే అన్నారు. 13 రోజులు గడిచినా మోడల్ స్కూల్స్, రెగ్యులర్ టీచర్లకు వేతనాలు అందలేదన్నారు. ఇక ఔట్ సోర్సింగ్, బెస్ట్ టీచర్ల పరిస్థితి కూడా ఆలానే ఉందన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరితో నిరుద్యోగులు ఆందోళన బాట పడుతున్నారని హరీష్ రావు ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు. గెస్ట్ లెక్చర్ల్లను ఎత్తి వేసేందుకు ప్రబుత్వం కుట్రం చేస్తుందన్నారు..1654 మంది గెస్ట్ లెక్చరర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందన్నారు. అభయహస్తం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా గెస్ట్ లెక్చరర్లకు భోరోసా ఇవ్వడంతో పాటు.. నెలకు 42 వేల రూపాయల వేతన చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News