Doctor Tests Positive for Coronavirus: ముందు కరోనా పాజిటివ్.. తర్వాత నెగటివ్.. డాక్టర్ షాక్

Doctor Tests Positive for Coronavirus: ఖమ్మం జిల్లాలో ఓ డాక్టర్ కు వింత అనుభవం జరిగింది.

Update: 2020-06-29 12:45 GMT

Doctor Tests Positive for Coronavirus: ఖమ్మం జిల్లాలో ఓ డాక్టర్ కు వింత అనుభవం జరిగింది. గత కొద్ది రోజులుగా కాస్త అనారోగ్యంతో బాధపడుతున్న వైద్యుడు తనకు కరోనా సోకిందేమోననే అనుమాతంలో ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్‌లో శాంపిల్ ఇచ్చాడు. కాగా ఆ పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో సదరు వైద్యులు హుటాహుటిన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌లో వైద్యం కోసం చేరాడు. అక్కడ వైద్యులు ఆయని కరోనా పరీక్షలు చేయగా నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆ వైద్యుడు ఒక్కసారిగా నివ్వెరపోయాడు.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే కొత్తగూడెం పట్టణానికి చెందిన డాక్టర్ ఇటీవల ఖమ్మంలో ప్రభుత్వ హాస్పిటల్‌‌లో కరోనా టెస్టులు చేయించుకున్నారు. టెస్టుల్లో పాజిటివ్ అని తేలిందని డీఎంహెచ్‌వో ఆయన తెలిపారు. అతనికి పాజిటివ్ అని తేలడంతో ఆ వైద్యుడితో పాటు ఆయన భార్యను కూడా గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా గాంధీ వైద్యులు బాధిత కుటుంబాన్ని మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉంచి టెస్టులు చేసారు. ఆ తరువాత పరీక్షల్లో అతనికి నెగిటివ్ అని తేలింది. ఆయన హాస్పిటల్‌ సిబ్బంది, ప్రైమరీ కాంటాక్టులు 40 మందికి కరోనా టెస్టులు చేయగా నెగటివ్ అని తేలింది. అందరికీ నెగటివ్ అని రావడంతో.. డీఎంహెచ్‌వోపై బాధిత వైద్యుడు కలెక్టర్ కర్ణన్‌కు ఫిర్యాదు చేశారు. 

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు గరిష్టంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 983 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 14,419 కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9000 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా నుంచి 5172 మంది కోలుకున్నారు. ఇక ఇవ్వాలా 244 మంది డిశ్చార్జ్ కాగా, నలుగురు మృతి చెందారు. 

Tags:    

Similar News