hmtv ప్రసారం చేసిన కథనాలకు స్పందించిన విద్యాశాఖ

పాఠశాలల్లో దోపిడీని బయటపెట్టిన hmtv స్టింగ్ ఆపరేషన్

Update: 2024-05-31 15:03 GMT

hmtv ప్రసారం చేసిన కథనాలకు స్పందించిన విద్యాశాఖ 

ప్రైవేట్,కార్పోరేట్ స్కూల్స్ ఇష్టారాజ్యంగా పుస్తకాలతో పాటు స్కూల్ డ్రెస్సులు ఇతర వస్తువులు అమ్మడం పై hmtv ప్రసారం చేసిన కథనాలపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. పాఠశాల ఆవరణలో పుస్తకాలు ,స్కూల్ డ్రెస్సులు ఇతరత్రా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ జిల్లా విద్యాధికారి ఆదేశాలు జారీ చేశారు.

ప్రైవేట్ ,కార్పోరేట్ స్కూల్స్ దందా hmtv బృందం స్టింగ్ ఆపరేషన్లో బయటపెట్టింది. చదువుకుందామా.. చదువుకొందామా.. పేరుతో ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్స్ అడ్డగోలు ఫీజుల వసూళ్లు...పుస్తకాలు,స్కూల్ డ్రెస్సులు పేరిట తల్లిదండ్రులను నిలువుదోపిడీకి గురిచేస్తున్న తీరుపై hmtv ప్రసారంపై క్షేత్ర స్థాయిలో పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది. తల్లిదండ్రుల బలహీనతను ఆసరా చేసుకొని డబ్బులు దండుకుంటున్న వైనాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించడం.. కార్పొరేట్ స్కూల్స్ నర్సరీకే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న తీరుపై ప్రసారం చేసిన కథనాల పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.

hmtv ప్రసారం చేసిన కథనాలకు స్పందించిన విద్యాశాఖ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపాలని అధికారులకు తెలిపింది. ఏ పాఠశాలలోనైనా పుస్తకాలు కానీ, స్కూల్ డ్రెస్సులు కానీ అమ్మితే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. hmtv కథనాలతో అధికారుల్లో చలనం రావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. 

Tags:    

Similar News