Harish Rao: రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం

Update: 2024-08-21 12:10 GMT

Harish Rao

Harish Rao: డెంగీ, మలేరియా, గున్యా వంటి విషజ్వరాలతో రాష్ట్రం వణుకుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం అన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. డెంగీ జ్వరాల బారిన పడి 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతుందని హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని వానాకాలం ప్రారంభంలోనే కోరామన్నారు. కానీ ప్రభుత్వం తమ సూచనలను పెడచెవిన పెట్టిందని, సకాలంలో చర్యలు తీసుకొని ఉంటే విషజ్వరాలు ఇంతగా విజృంభించేవి కావని ఎక్స్‌లో పోస్ట్ చేశారు హరీష్‌రావు. విష జ్వరాల నివారణకు, పారిశుద్ధ్య నిర్వహణపై ముఖ్యమంత్రి ఒక్కనాడు కూడా సమీక్ష నిర్వహించ లేదని విమర్శించారు. దోమల నివారణకు గ్రామాలు, పట్టణాల్లో స్పెషల్ డ్రైవ్ లు చేపట్టలేదని, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని మండిపడ్డారు హరీష్‌రావు.


Tags:    

Similar News