లాక్‌డౌన్‌తో పెరిగిన సైబర్‌ నేరాలు.. ఫోన్ మోగిందా.. సొమ్ము గోవింద..!

Cyber Crime: హైదాబాద్‌లో మల్టీ లెవల్‌ మోసాల జోరు * నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లు

Update: 2021-06-08 07:41 GMT

Representational Image

Cyber Crime: సైబర్ నేరాలకు హద్దు అదుపులేకుండా పోయింది. రోజుకో పద్ధతిలో మోసగాళ్లు నేరాలు చేస్తున్నారు. భాగ్యనగర వాసులు సైబర్ వలలో చిక్కుకుంటున్నారు. మోసగాళ్ల మాటలు నమ్మి నట్టేటమునుగుతున్నారు. బ్యాంకుఖాతా రహస్య వివరాలు చెప్పినగదును పోగొట్టుకుంటున్నారు. ఈ మెయిల్స్‌, ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వస్ట్‌లు, వాట్సాప్‌ల ద్వారా అమాయక ప్రజల ఖాతాలను సైబర్‌ కిలాడీలు కొల్లగొడుతున్నారు

ఇంటర్‌నెట్‌ కార్యక్షేత్రంగా, స్మార్ట్‌ఫోన్లే నయా దోపిడి సాధనాలుగా సైబర్‌ నేరగాళ్లు అంతకంతకు పేట్రేగిపోతున్నారు. పంథా మార్చుకొని అప్‌డేట్‌ వర్షన్‌లో అటాక్‌ చేస్తున్నారు. గ‌తంలో బ్యాంక్ కేవైసీ, పేటీఎం కేవైసీ అప్ డేట్ చేయాలంటూ కాల్స్ వ‌చ్చేవి ఇప్పుడు మొబైల్ కేవైసీ అంటూ మెసేజ్ లు చేస్తున్నారు....అప్ డేట్ చేసుకోక‌పోతే సిమ్ బ్లాక్ అవుతుంద‌ని ఓ నెంబ‌ర్ ఇస్తారు ఓ ప‌ది రూపాయ‌లు పంపి డిటేయిల్స్ ఎంట‌ర్ చేయాల‌ని ఓ లింక్ పంపిస్తారు.. అందులో డెబిట్ కార్డ్ నెంబ‌ర్ తో పాటు ఇత‌ర వ్యక్తిగ‌త వివ‌రాలు అడుగుతారు అది ఫిల్ చేసి పంపిన వెటంనే మ‌న డిటేయిల్స్ మొత్తం వారికి చేరుతాయి ఓటీపీ నెంబ‌ర్ చెబితే డ‌బ్బులు రీ ఫండ్ అవుతాయ‌ని న‌మ్మబ‌లుకుతారు ఇలా రెండు మూడు సార్లు ఓటీపీ సెండ్ చేసి పెద్ద మొత్తంలో డ‌బ్బులు లాగుతున్నారు సైబ‌ర్ నేర‌గాళ్లు ఇలాంటి వారిని న‌మొద్దని ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని సైబ‌ర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

క‌రోనా క‌ష్టకాలంలో ప్రజ‌ల అవ‌స‌రాని క్యాష్ చేసుకుంటూ మోసాల‌కు పాల్పడుతున్నారు సైబ‌ర్ నేర‌గాళ్లు. ఆక్సిజ‌న్ కాంసెంట్రేట‌ర్లు, వ్యాక్సినేష‌న్, బ్లాక్ ఫంగ‌స్ ఇంజెక్షన్లు అంటూ మోసాల‌కు పాల్పడుతున్నారు. ఇటీవ‌ల కాలంలో హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్స్ లో ఈ త‌ర‌హా కేసులు 12 న‌మోద‌య్యాయి.

నిరక్ష్యరాస్యులు సహా చదువుకున్న వారిని సులభంగా బోల్తా కొట్టిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సైబర్ నేరాలు ఎక్కువగా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో బాధితులు ఎక్కువగా ఉన్నారని ఐటీ నిపుణులు వెల్లడిస్తున్నారు. దీంతో త‌స్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు సైబ‌ర్ క్రైమ్ పోలీసులు. 

Full View


Tags:    

Similar News