ఇవాళ రాజ్‌భవన్‌ను ముట్టడించనున్న సీపీఐ

Koonamneni Sambasiva Rao: దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం.. తెలంగాణ నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం

Update: 2022-12-07 01:21 GMT

ఇవాళ రాజ్‌భవన్‌ను ముట్టడించనున్న సీపీఐ

CPI: రాజ్యాంగ పదవి గవర్నర్ వ్యవస్థను రద్దుచేయాలని దేశవ్యాప్తంగా ఉద్యమించాలని నిర్ణయించామని సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లోని రాజభవన్‌ను ముట్టడిస్తామని ఆయన ప్రకటించారు. రాజకీయ పార్టీల కన్నుసన్నల్లో పనిచేసే గవర్నర్లు రాజ్యాంగేత శక్తులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ, తమిళనాడు, కేరళలో గవర్నర్ల పనితీరును ప్రస్తావించారు.

ప్రభుత్వ విధానాల్లో నిర్ణయం తీసుకునే అధికారం లేకున్నప్పటికీ బిల్లులు ఆమోదించే విషయంలో ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారని ఆయన విచారం వ్యక్తంచేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తమకు ఇష్టం వచ్చిన వారిని గవర్నర్ పదవుల్లో కూర్చొనిబెడుతున్నారేగానీ, ఒక ప్రామాణికత లేకుండా పోయిందన్నారు. తెలంగాణనుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామని కూనంనేని సాంబశివరావు తెలిపారు.

Tags:    

Similar News