TS Cabinet Meeting: అర్హులైన పేదలకు త్వరలో రేషన్ కార్డులు
TS Cabinet Meeting: విద్యుత్ కొనుగోళ్లపైనా మరో కమిటీ ఏర్పాటు
TS Cabinet Meeting: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు వెల్లడించారు. 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నియామకం పైనా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
కాళేశ్వరంపై న్యాయ విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేసి 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. విద్యుత్ కొనగోళ్లపై సైతం మరో కమిటీని ఏర్పాటు చేసింది. ఒక్కో నియోజకవర్గంలో 3 వేల 500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళా సంఘాలు చేసిన వస్తువులకు బ్రాండింగ్ కోసం ఓఆర్ఆర్ చుట్టూ 30 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2008 డీఎస్సీ అభ్యర్థులకు సంబంధించిన మినిమమ్ పే స్కెల్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని మంత్రులు ప్రకటించారు.