Coronavirus Updates in Telangana: తెలంగాణలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు
Coronavirus Updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు గరిష్టంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 983 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
Coronavirus Updates in Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు గరిష్టంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 983 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 14,419 కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9000 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా నుంచి 5172 మంది కోలుకున్నారు. ఇక ఇవ్వాలా 244 మంది డిశ్చార్జ్ కాగా, నలుగురు మృతి చెందారు.
తాజాగా నమోదైన కేసులలో ఒక్క GHMC పరిధిలోనే 816 కేసులు ఉన్నాయి. ఇక రంగారెడ్డిలో 47, మేడ్చెల్ లో 29, నల్గొండలో 03, భద్రాద్రి కొత్తగూడెంలో 05, కరీంనగర్, సిద్దిపేట లో 03, వరంగల్ (అర్బన్ ) లో 12, ఆదిలాబాద్ లో 02, ఖమ్మంలో 03, మంచిర్యాల్ లో 33, వరంగల్ (రూరల్ ) లో 19, గద్వాల్ లో 02, మెదక్, సూర్యాపేట, నిజామాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, జనగాంలో ఒక్కో కేసు నమోదు అయింది.
ఇక ఇందులో ఒక్క GHMC పరిధిలోనే కరోనా కేసులు అత్యధికంగా పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది.. దీనితో గ్రేటర్ హైదరాబాద్ లో మరో 15 రోజుల పాటు మళ్లీ లాక్‌డౌన్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఆదివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కరోనా వ్యాప్తి, నివారణకు తీసుకుంటున్న చర్యలు, బాధితులకు చికిత్స అందిస్తోన్న తీరు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో సమాలోచనలు జరిపారు. ఇందులో అధికారులు హైదరాబాద్ లో 15 రోజుల పాటు మళ్లీ లాక్‌డౌన్ విధించాలని నివేదించారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ లాక్ డౌన్ విధించేందుకు విధివిధానాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.