ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఉదాసీనతతో శనగ రైతులు నష్టపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. మార్కెట్ మొత్తం దళారుల గుప్పిట్లోకి వెళ్లిపోయిందని విమర్శించిన రేవంత్ మద్ధతు ధర 5 వేల 100 కూడా రైతుకు దక్కడం లేదని మండిపడ్డారు. తక్షణం మార్క్ ఫెడ్ ద్వారా శనగ పంట కొనిపించాలని డిమాండ్ చేశారు. మరో 20 రోజుల్లో యాసంగి పంట వస్తోందని ప్రభుత్వం పంట కొనదేమోని రైతులు ఆందోళ చెందుతున్నారని చెప్పారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు పునరుద్ధరించాలన్న రేవంత్ రైతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదని హెచ్చరించారు.