Musi River Plan: నేడు సీఎం పుట్టినరోజు..నేడే మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర

Update: 2024-11-08 02:27 GMT

CM Revanth Reddy : విజయమే లక్ష్యంగా పని చేయాలి..

Musi River Plan: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 9గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బేగంపేట విమానాశ్రయం నుంచి యాదాద్రికి సీఎం బయలుదేరుతారు. 9.20 నిమిషాలకు యాదాద్రికి చేరుకుని 11. 15 గంటల మధ్యలో యాదాద్రి నరసింహున్ని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు వైఐడీఏ, యాదాద్రి ఆలయ డెవలప్ మెంట్ పనుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు.

అనంతరం మిషన్ భగీరథలో భాగంగా సిద్ధిపేట జిల్లా మల్లన్నసాగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 500 గ్రామాలకు మంచినీటిని అందించేందుకు రూ. 210కోట్ల వ్యయంతో చేసే పైప్ లైన్ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. దీనికి సంబంధించిన పైలాన్ ను యాదగిరిగుట్టలో ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేసిన అనంతరం రోడ్డు మార్గంలో సంగెం గ్రామానికి బయలుదేరుతారు.

మధ్యాహ్నం 2.10 నుంచి 3గంటల వరకు వలిగొండ మండల పరిధిలోని బొల్లేపల్లి నుంచి సంగెం, భీమలింగం వంతెన వరకు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేపడతారు. సంగెం నుంచి భీమలింగం వరకు దాదాపు 2.5 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. పాదయాత్రలో భాగంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప రథం నుంచే ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.

ఇక మూసీ పునరుజ్జీవం ఎంత ఆవశ్యకమూ చెప్పేందుకు వాడపల్లి నుంచి తాను పాదయాత్ర చేస్తానని నల్లగొండ జిల్లా ప్రజలు మూసీ ప్రక్షాళనకు కోరుకుంటున్నారా లేదా అని వారినే అడిగి తెలుసుకునేందుకు తన కలిసి హరీశ్ రావు, కేటీఆర్, ఈటెల నడుస్తారా అంటూ సీఎం రేవంత్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News