Harish Rao: రైతుల సంఖ్యను తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం
Harish Rao: మార్గదర్శకాల పేరుతో రైతుల వడపోతలపై ప్రభుత్వం దృష్టి సారించింది
Harish Rao: రుణమాఫీ లబ్ధిదారుల్లో రైతుల సంఖ్యను తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ ఆరోపించారు. మార్గదర్శకాల పేరుతో రైతుల వడపోతలపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు అందరూ రుణాలు తీసుకోవాలని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ చేస్తామని, రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ అంటున్నారని హరీష్‌రావు ధ్వజమెత్తారు. బ్యాంకులకు లేని గైడ్ లైన్స్ ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం కుటుంబంలో పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. అన్నదమ్ములు విడిపోయినా రేషన్ కార్డులో ఒకే కుటుంబంగా వున్నారని గుర్తు చేశారు. పాస్ బుక్ వుండి బ్యాంకులో రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష రూపాయల రుణమాఫీకి ఎలాంటి షరతులు పెట్టలేదన్నారు హరీష్ రావు.