Revanth Reddy: ఎలివేటేడ్ కారిడార్లకు లైన్‌క్లియర్.. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్
Revanth Reddy: రక్షణశాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి
Revanth Reddy: ఎలివేటెడ్ కారిడార్లకు అడ్డంకులు తొలగిపోయాయి. హైదరాబాద్ లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. జనవరి 5న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని కోరుతూ రాసిన లేఖపై కేంద్రం స్పందించింది. కేంద్ర రక్షణ శాఖ భూముల కేటాయింపునకు సంబంధించి నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. హైదరాబాద్-కరీంననగర్ రాజీవ్ రహదారితోపాటు, హైదరాబాద్-నాగ్ పూర్ జాతీయ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ అభివృద్ధికి అత్యంత కీలకమైన కారిడార్ల నిర్మాణానికి అనుమంతించడం పట్ల ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.