Revanth Reddy: ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్ సమీక్ష.. హాజరైన మంత్రి పొంగులేటి, ధరణి కమిటీ సభ్యులు

Revanth Reddy: నివేదికలో చిన్న చిన్న మార్పులతో పరిష్కారమయ్యే అంశాలు

Update: 2024-02-24 09:58 GMT

Revanth Reddy: ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్ సమీక్ష.. హాజరైన మంత్రి పొంగులేటి, ధరణి కమిటీ సభ్యులు

Revanth Reddy: ధరణి పోర్టల్‌పై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ధరణి కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. ధరణిలో సమస్యలపై తాము సిద్ధం చేసిన మధ్యంతర నివేదికను అందించనున్నారు. పోర్టల్‌ పేరు మార్పుతో పాటు అందులో చేయాల్సిన మార్పులను సీఎం రేవంత్‌ రెడ్డికి వివరించనున్నారు కమిటీ సభ్యులు. చిన్న చిన్న మార్పులతో పరిష్కారం అయ్యే వాటిని.. మధ్యంతర నివేదికలో చేర్చింది ధరణి కమిటీ. గతంలో పట్టా ఉండి ధరణి వచ్చిన తర్వాత ఫారెస్ట్... దేవాదాయశాఖ భూములుగా జాబితాలో ఉన్న వాటికి.. వీలైనంత త్వరగా మార్పులు చేర్పులు చేయాలని ధరణి కమిటీ నివేదికలో పేర్కొంది.

ధరణి సమస్యలపై పలు శాఖల అధికారులతో పాటు కలెక్టర్లతో పలుదఫాలుగా సమావేశాలు నిర్వహించింది ధరణి కమిటీ. దేవాదాయ శాఖతో పాటు అటవీ శాఖతో సమావేశమై ధరణి సమస్యలపై ఆరా తీసింది. ధరణి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. వాటిని సాల్వ్ చేయడానికి ఏం చేయాలనే అంశాలు సేకరించింది. ధరణి రిజిస్ట్రేషన్‌లల్లో భారీగా లోపాలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ధరణిలో ఉన్న సమస్యలకు ఎలాంటి పరిష్కార మార్గాలు తీసుకుంటే బాగుంటుందనే ఫీడ్ బ్యాక్ తీసుకుంది. ఇలా ధరణి సమస్యలపై దృష్టి పెట్టిన కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ నివేదిక ఆధారంగా ధరణిలో ఎలాంటి మాడ్యూల్స్ చేంజ్ చేస్తారనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News