CM KCR: ఈ నెల 16న పాలమూరు.. రంగారెడ్డి వెట్ రన్.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
CM KCR: ఈ పథకంతో దక్షిణ తెలంగాణలోని ప్రతి పల్లెకు తాగు-సాగు నీరు
CM KCR: ఈనెల 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్‌రన్ ప్రారంభం కానుంది. నార్లాపూర్ ఇన్‌టేక్ వద్ద సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు ఈ ప్రాజెక్ట్ సిద్ధమైంది. 2 కిలోమీటర్ల దూరంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయనున్నారు. ఇది దక్షిణ తెలంగాణకు పండగ రోజని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. దైవ సంకల్పం, ఇంజినీర్ల కృషితో అడ్డంకులు అధిగమించి.. పాలమూరు ఎత్తిపోతల పథకం కల సాకారమైందని చెప్పారు.
ఈ పథకంతో దక్షిణ తెలంగాణలోని ప్రతి పల్లెకు తాగు-సాగు నీరు అందుతుందని, బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానుందని అభిప్రాయపడ్డారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా కృష్ణమ్మకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అదే రోజున భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఇక.. ఈ నెల 17న ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కృష్ణమ్మ నీటితో దేవుళ్ల పాదాలు కడగనున్నారు సర్పంచులు.