మోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
CM KCR vs PM Modi: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రాధాన్యతను తగ్గించేలా కేసీఆర్ శక్తివంచన లేకుండా శ్రమించారు.
CM KCR vs PM Modi: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రాధాన్యతను తగ్గించేలా కేసీఆర్ శక్తివంచన లేకుండా శ్రమించారు. మోడీ హైదరాబాద్ లో దిగడానికి ముందే అనేక ప్రశ్నలు సంధించారు. రేపటి బహిరంగ సభలో ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పాలని మోడీకి సవాల్ చేశారు. దేశంలో 4 వేలకు టన్ను దొరికే బొగ్గును మోడీ మిత్రుల కోసం 25 వేల నుంచి 30 వేల వరకు పెట్టి ఎందుకు కొనుగోలు చేయాలో చెప్పాలన్నారు.
శ్రీలంకలో మోడీ మిత్రుడి కోసం పవర్ ప్రాజెక్టు కట్టబెట్టేందుకు సేల్స్ మెన్ గా దిగజారిపోయారన్నారు. అమెరికా అధ్యక్షుడి ఎన్నికలో హోస్టన్ కు వెళ్లినప్పుడు అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ చతికిలపడ్డారని అదేమైనా అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికనా అక్కడ ఇండియా పరువు తీశారన్నారు. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ అధ్వానంగా ఎందుకు తయారైందో చెప్పాలన్నారు. మరి కేసీఆర్ సంధించిన కీలకమైన ఇలాంటి ప్రశ్నలకు రేపటి బహిరంగ సభలో మోడీ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలని ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మోడీకి కేసీఆర్ సంధించిన ప్రశ్నలు
దేశీ బొగ్గుకు టన్ను రూ.4 వేలైతే 30 వేలు ఎందుకు పెట్టాలి?
రూపాయి విలువ ఎందుకు దారుణంగా పడిపోతోంది?
చైనా 16 ట్రిలియన్ డాలర్లు జీడీపీ సాధిస్తే మనకేమైంది?
5 ట్రిలియన్ డాలర్లు కూడా ఎందుకు సాధించలేకపోయారు?
మేకిన్ ఇండియా ద్వారా ఏం సాధించారో చెప్పాలి?
రైతు చట్టాల్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారో చెప్పాలి?
శ్రీలంకలో సేల్స్‌మేన్‌గా ఎందుకు మారారో చెప్పాలి?
ఫియట్, పోర్డ్, హార్లీ డేవిడ్సన్ వంటి కంపెనీలు ఎందుకు వెళ్లాయి?