దుబ్బాకలో టీఆర్ఎస్‌ గెలుపు ఎప్పుడో డిసైడైంది : సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.

Update: 2020-10-29 10:19 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. దుబ్బాకలో మంచి మెజారిటీతో గెలుస్తామన్న కేసీఆర్‌, దుబ్బాకలో టీఆర్ఎస్‌ గెలుపు ఎప్పుడో డిసైడైందన్నారు. దుబ్బాకలో గ్రౌండ్‌ లెవల్‌ చాలా క్లియర్‌గా ఉందని టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తామని అన్నారు. అసలు, దుబ్బాక ఉపఎన్నిక తమకు పెద్ద లెక్కే కాదన్నారు.

ఇక, 15రోజుల్లో నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఓపెన్ ప్లాటైనా నాన్ అగ్రికల్చర్ ఆస్తిగా నమోదు చేసుకోవాలన్న కేసీఆర్, ప్లాట్ల వివరాలు వెబ్‌సైట్లో కనిపించకూడదంటే హైడ్‌ ఆప్షన్ పెట్టుకోవచ్చన్నారు. అయితే, పూర్తి టైటిల్‌ విషయంలో ఓనర్ నష్టపోతే ప్రభుత్వమే నష్టపరిహారం ఇస్తుందన్నారు. ఇక, ధరణి పోర్టల్‌ బ్యాకప్ సర్వర్లను వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. 

Tags:    

Similar News