Bhatti Vikramarka: మహిళా కూలీలతో కలిసి పత్తి విత్తనాలు నాటిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
Bhatti Vikramarka: కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్న భట్టి
Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర 85రోజు చందంపేట మండలం గన్నేర్లపల్లి గ్రామం చేరుకుంది. ఈ సందర్భంగా మహిళా కూలీలతో కలిసి భట్టి పత్తి విత్తనాలు నాటారు. ఆ తర్వాత కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఏడాది పత్తి విత్తనాలు 750 నుంచి 850 రూపాయలు ఉంటే.. ఈసారి 1400 వరకు పెంచడం వల్ల రైతులపై భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి కేటీఆర్ పై ఫైరయ్యారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఒక ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై నిలదీస్తే కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పేదలకు పంచిన భూములను బహుళ కంపెనీలకు కట్టబెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇక ధరణిలో ఎంట్రీ కాకుండా చాలా ఎకరాల భూములను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందన్నారాయన.