Hanamkonda: హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఘర్షణ
Hanamkonda: రెండు వర్గాల మధ్య మరోసారి భగ్గుమన్న విభేదాలు
Hanamkonda: హన్మకొండ జిల్లా కాంగ్రెస్లో మరోసారి రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొండా వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పరకాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ సన్నాహక సమావేశం ఏర్పాటుచేశారు. పార్టీ సమావేశాలకు సమాచారం ఇవ్వడం లేదని కొండా వర్గానికి చెందిన గజ్జి విష్ణు ఆరోపించారు. దీంతో రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొండా వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం తోసుకున్నాయి. గొడవను సద్దుమణిగించేందుకు గజ్జి విష్ణును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గజ్జి విష్ణును వెంటనే విడుదల చేయాలంటూ కొండా వర్గీయులు రోడ్డుపై బైఠాయించారు. గొడవకు కారణమైన గజ్జి విష్ణును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు... వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రకటించారు.