చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య

Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు.

Update: 2024-06-21 04:04 GMT

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య

Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు. అల్వాల్‌లోని పంచశీల కాలనీలోని తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. పదేళ్ల క్రితం మేడిపల్లి సత్యం రూపాదేవి ప్రేమ వివాహం చేసుకున్నారు. మేడిపల్లి సత్యం దంపతులకు ఇద్దరు పిల్లలు యోజిత్, రిషిక శ్రీ ఉన్నారు.

కాగా రూపాదేవి మేడ్చల్ మునీరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా ఎమ్మెల్యే దంపతుల విభేదాలు ఉన్నట్లు సమాచారం. అయితే భార్య మరణ వార్తను తట్టుకోలేక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పృహ తప్పి పడిపోయారు. మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి మృతి విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ మేడిపల్లి సత్యంను పరామర్శించారు.

Tags:    

Similar News