ఖమ్మం జిల్లా మేడేపల్లిలో చిరుత కలకలం
* మేడేపల్లిలో చిరుతపులి పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు
Khammam: ఖమ్మం జిల్లా మేడేపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పాదముద్రలు ఆధారంగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. చిరుతపులి ఉన్నట్టు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు పనులచేసేందుకు చేనులోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. పులి సమాచారం తెలిస్తే సమాచారం అందించాలని కోరారు.