Hyderabad: మాధవీలతపై కేసు ఏంటి?
ముస్లిం ఓటర్ల బురఖాలను తొలగించి ఓటరు గుర్తింపు కార్డులను పరిశీలించారు.
Lok Sabha Election 2024: హైద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన మాధవీలతపై మలక్ పేట పోలీస్ స్టేషన్ లో సోమవారం నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న క్రమంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు గుర్తింపు కార్డు తనిఖీ విషయలో వివాదం తలెత్తింది.
ముస్లిం ఓటర్ల బురఖాలను తొలగించి ఓటరు గుర్తింపు కార్డులను పరిశీలించారు. ఈ విషయమై ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశాల మేరకు 171 సీ, 186,505(1),(సీ) 132 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఫేస్ మాస్కులు లేకుండా గుర్తింపు కార్డుల వెరిఫికేషన్ చేసే హక్కు అభ్యర్ధులకు ఉంటుందని మాధవీలత చెప్పారు. ఐడీ కార్డుల వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నట్టు తాను అభ్యర్ధించిన విషయాన్ని మాధవీలత పేర్కొన్నారు.
హైద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాగా వేయాలని బీజేపీ అన్ని అస్త్రాలను ఉపయోగిస్తుంది. ఈ స్థానంలో ఎంఐఎం అభ్యర్ధి అసదుద్దీన్ ఓవైసీపై మాధవీలతను బరిలోకి దింపింది కాషాయ పార్టీ. అభ్యర్ధి ఎంపిక నుండి ప్రచారం వరకు బీజేపీ జాగ్రత్తలు తీసుకుంది.