Vikarabad: శిరీష హత్య కేసులో బావే హంతకుడు.. మిస్టరీ కేసును ఛేదించిన పోలీసులు

Vikarabad: అనిల్‌కు సహకరించిన మరో వ్యక్తి రాజు అరెస్ట్‌

Update: 2023-06-14 07:02 GMT

శిరీష హత్య కేసులో బావే హంతకుడు.. మిస్టరీ కేసును ఛేదించిన పోలీసులు 

Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో మిస్టరీగా మారిన శిరీష హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. మృతురాలి బావ అనిలే హంతకుడిగా నిర్ధారణకు వచ్చారు. నిందితుడు అనిల్‌తో పాటు అతని స్నేహితుడు రాజుని అదుపులోకి తీసుకున్నారు. శిరీష హత్యలో అనిల్‌కు రాజు సహకరించినట్లు పోలీసులు నిర్ధారించారు.

కళ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష ‎ఈనెల 10న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత నీటి కుంటలో శవంగా కనిపించింది. తమ కూతురు కనిపించడం లేదంటూ గాలించిన కుటుంబసభ్యులకు శిరీష విగతజీవిగా కనిపించింది. కళ్లల్లో పొడిచిన గాయాలు, గొంతు కోసిన ఆనవాళ్లతో అత్యంత దారుణమైన పరిస్థితిలో కనిపించింది శిరీష మృతదేహం. అయితే శిరీషది హత్యా..? ఆత్మహత్యా? అనేది నిర్ధారణకు రాలేకపోయారు పోలీసులు. రెండు సార్లు పోస్టుమార్టం నిర్వహించినా డాక్టర్లు కూడా ఎటూ తేల్చలేకపోవడంతో కేసులో మిస్టరీని ఛేదించలేకపోయారు.

అయితే శిరీష ఇంట్లో నుంచి వెళ్లే ముందు ఆమె బావ అనిల్ చేయి చేసుకున్నాడు. ఆ తర్వాతే శిరీష ఇంట్లో నుంచి వెళ్లిపోవడం.. మరుసటి రోజే అత్యంత దారుణమైన హత్యకు గురైనట్లు గుర్తించడంతో బావ అనిల్‌ చుట్టూ ఈ కేసు విచారణ కొనసాగింది. అయితే అప్పటికీ ఏమీ తేలలేదు. దాంతో శిరీష మొబైల్‌.. విచారణలో కీలకంగా మారింది. శిరీష మృతి చెందిన మరుసటి రోజు ఆమె మొబైల్ నుంచి ఫోన్ కాల్ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు సీడీఆర్ ద్వారా కాల్ డేటా తీసుకున్నారు. అప్పటివరకు పాస్‌వర్డ్ తెలియదంటూ బుకాయించిన శిరీష బావ అనిల్‌ కాల్‌ డేటా తర్వాత బుక్కయ్యాడు. ఆ తర్వాత కాస్త గట్టిగా విచారించడంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. 

Tags:    

Similar News