Medak: మెదక్ జిల్లా రామాయంపేటలో వికసించిన బ్రహ్మకమలాలు
Medak: బ్రహ్మ కమలాలను దర్శించేందుకు వస్తున్న ప్రజలు * మొక్కకు ఎనిమిది బ్రహ్మకమలాలు
Medak: మెదక్ జిల్లా రామాయంపేట తొమ్మిదో వార్డులో బ్రహ్మకమలాలు వికసించాయి. స్థానిక కౌన్సిలర్ దేవుని జయరాజుకు చెందిన మినరల్ వాటల్ ప్లాంట్లో కమలాలు వికసించాయి. బ్రహ్మకమలం శివునికి అత్యంత ప్రీతికరమైనది అని భక్తుల విశ్వాస్తుంటారు. హిమాలయాలలో దొరికే ఈ మొక్క ఇంట్లో మంచిదని భావిస్తుంటారు. దాంతో ఈ బ్రహ్మకమలం మొక్కకు ఎనిమిది కమలాలు వికసించాయి. రాత్రి సమయంలో మాత్రం రెండుగంటల పాటు వికసించే ఈ పుష్పం గత రాత్రి రామాయంపేటలో ఎనిమిది పుష్పాలు ఏకకాలంలో వికసించి కనువిందు చేశాయి. ఆ పుష్పాలను తెంపి స్థానిక శివాలయంలో శివునికి సమర్పించారు.