Bhatti Vikramarka: దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కులేదు
Bhatti Vikramarka: దేశంలో ప్రజాస్వామ్యంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది
Bhatti Vikramarka: పార్లమెంట్‌పై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే చూడాలని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశంలో ప్రజాస్వామ్యంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో దేవాలయంగా భావించే భారత పార్లమెంట్‌పై దాడి జరిగితే ప్రధాని, హోంమంత్రి ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. దాడి ఘటనపై సభ చర్చ జరగాలని డిమాండ్ చేస్తే.. 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని అన్నారు. దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదని విమర్శించారు భట్టి. పార్లమెంట్‌లో భారీ సంఖ్యలో ఎంపీలను సస్పెండ్ చేసిన చరిత్ర ఎప్పుడూ లేదన్నారు భట్టి.