1 Lakh For BCs: తెలంగాణలో తహశీల్దార్ ఆఫీసులకు లబ్ధిదారుల క్యూ.. 3 రోజుల్లో 53 వేల దరఖాస్తులు

1 Lakh For BCs బీసీల కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం

Update: 2023-06-13 08:19 GMT

1 Lakh For BCs: తెలంగాణలో తహశీల్దార్ ఆఫీసులకు లబ్ధిదారుల క్యూ.. 3 రోజుల్లో 53 వేల దరఖాస్తులు

1 Lakh For BCs: తెలంగాణ ప్రభుత్వం తీసుకువ‌చ్చిన కుల‌వృత్తుల‌కు ఆర్థిక‌ చేయూత ఫ‌థ‌కానికి భారీగా స్పంద‌న ల‌భిస్తోంది. ఈనెల 9న సీఎం చేతుల‌ మీదుగా ప్రారంభమైన ఈ ఫ‌థ‌కానికి దరఖాస్తు చేసుకునేందుకు ల‌బ్ధిదారులు పోటీ ప‌డుతున్నారు. మూడు రోజుల్లో ఏకంగా 53 వేల పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.

కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చి వారి జీవితాలను మెరుగుపర్చేందుకు.. వారికి ఉపయోగపడే ముడిసరుకు, పనిముట్లు కొనుగోలు చేసేందుకు ఎలాంటి బ్యాంకు లింక్‌ లేకుండా, తిరిగి చెల్లించే అవసరం లేకుండా లక్ష రూపాయల సహాయం ప్రభుత్వం చేస్తుంది. విశ్వబ్రాహ్మణ ,నాయి బ్రాహ్మణ, రజక ,కుమ్మరి ,మేదరి వంటి కుల వృత్తులు చేతి వృత్తులను నమ్ముకుని జీవిస్తున్న వారికి ఈ ఆర్థిక సాయం అందించనుంది. జూన్ 2, 2023 వరకు 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హులని తెలిపింది. ఈ పథకానికి అర్హులైన వారు ఈనెల 20 వరకు దరఖాస్తులు చేయాలని గడువిచ్చింది. దీంతో ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల కోసం లబ్ధిదారులు తహశీల్దార్ కార్యాలయాల దగ్గర బారులు తీరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్టిఫికెట్ల కోసం మీ సేవ సెంటర్లకు క్యూ కడుతున్నారు.

ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయానికి జూన్ 6 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం మంచిర్యాల జిల్లాలో తహశీల్దార్ ఆఫీస్‌ల చుట్టూ లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే రెవెన్యూ అధికారులు దశాబ్ది ఉత్సవాల్లో బిజీగా ఉండటంతో.. గడువు పెంచాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ తహశీల్దార్ ఆఫీసుల్లో ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మీసేవ, తహశీల్దార్ కార్యాలయాల దగ్గర జనాలు బారులు తీరారు.

Tags:    

Similar News