Barrelakka: ఆర్జీవీపై చర్యలు తీసుకోవాలి.. మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క
Barrelakka: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వ్యూహం సినిమాకు హైకోర్టు బ్రేక్ వేసింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
Barrelakka: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వ్యూహం సినిమాకు హైకోర్టు బ్రేక్ వేసింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. జనవరి 11 వరకు హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ మువీపై జనసేన, టీడీపీ నేతలు, ఆర్టీవీ మధ్య గత కొంత కాలంగా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో జనసేన నేత పవన్‌ను విమర్శించడానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫేమస్ అయిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష పేరును వాడుకోవడం వివాదంగా మారింది.
తాజాగా వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ గోపాల్ వర్మ బర్రెలక్క పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆమె తరపున లాయర్ రామ్ గోపాల్ వర్మపై గురువారం మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శిరీష తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘వ్యూహం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ‘ఊరు.. పేరు లేని ఆవిడ.. బర్రెలక్కగా చాలా ఫేమస్ అయిపోయింది’.. అని ఆర్జీవీ అవమానకరంగా మాట్లాడినట్లు తెలిపారు.
బర్రెలక్క బర్రెలు కాస్తుంది. బర్రెలు ఆమె మాటలు వింటాయి. అందుకే ఆమెను బర్రెలక్క అంటారు.. అంటూ తనదైన స్టైల్లో సెటైరికల్ కామెంట్ చేశారు వర్మ. ఆ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న బర్రెలక్క.. వర్మపై తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మరి ఈ పిర్యాదుపై తెలంగాణ మహిళా కమిషన్ ఎలా స్పందించనుందో చూడాలి.