Sircilla: బాల రాముడి రూపంలో బొజ్జ గణపయ్య.. చూడటానికి రెండు కళ్లు చాలవు..!

Sircilla: వినాయక నవరాత్రి ఉత్సవాలు అనగానే వినూత్న రీతుల్లో గణపతి విగ్రహాలు దర్శనమిస్తుంటాయి.

Update: 2024-09-13 09:30 GMT

Sircilla: బాల రాముడి రూపంలో బొజ్జ గణపయ్య.. చూడటానికి రెండు కళ్లు చాలవు..!

Sircilla: వినాయక నవరాత్రి ఉత్సవాలు అనగానే వినూత్న రీతుల్లో గణపతి విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. పర్యావరణ హితం కోరుతూ కొందరూ.. ప్రకృతి ప్రియుడి అవతారంలో కొందరు.. ఇలా భక్తులను ఆకర్షించేలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా విగ్రహాలు ఏర్పాటు చేసి నవరాత్రుల్లో ఆరాధిస్తూ ఉంటారు. సిరిసిల్ల పట్టణంలోనూ ఇలా వినూత్నంగా ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

సిరిసిల్ల పట్టణంలోని బివై నగర్ హిందూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముడిని పోలిన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అచ్చం అయోధ్య రామమందిరం లాంటి సెట్ వేసి.. అక్కడ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ బాలరాముడి రూపంలో ఉన్న గణపయ్యను చూడడానికి జనం బారులు తీరారు. ఈ గణపతి విగ్రహానికి సుమారు లక్షకు పైగా ఖర్చు అవగా, మహారాష్ట్రలో తయారు చేయించారు. అయోధ్య రామ మందిరాన్ని పోలిన సెట్టు వేయడానికి సుమారు నాలుగు లక్షలు ఖర్చు చేశారు. ఆలయ సెట్టు వేయడానికి దాదాపు 20 రోజులకు పైగా పట్టిందని మండప నిర్వాహకులు తెలిపారు.

25 ఏళ్లుగా హిందూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. పదిహేనేళ్లుగా నిర్వాహకులు దేశంలోని ప్రముఖ ఆలయాల రూపంలో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి వినాయకున్ని ప్రతిష్టిస్తున్నారు. గత సంవత్సరం చంద్రయాన్ 2 రూపంలో, అంతకుముందు బద్రీనాథ్, తిరుమల, పర్ణశాల, శబరిమల, షిరిడి లాంటి ప్రముఖ ఆలయాల రూపంలో మండపాలను ఏర్పాటు చేశారు. 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ పురస్కరించుకున్న సందర్భంగా ఈ ఏడాది అయోధ్య ఆలయం సెట్టు వేసి... బాల రాముని రూపంలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్టించారు.


Tags:    

Similar News