Drugs case: ర్యాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరో నిందితుడి అరెస్ట్

Drugs case: హైదరాబాద్‌లో 15 మంది ఏజెంట్ల ద్వారా డ్రగ్స్ సరఫరా

Update: 2024-03-21 02:40 GMT

Drugs case: ర్యాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరో నిందితుడి అరెస్ట్

Drugs case: ర్యాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అబ్దుల్ రెహమాన్‌ను అరెస్ట్ చేశారు. అబ్దుల్ రహమాన్‌తో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు మాదాపూర్ డిసిపి వినీత్ తెలిపారు. ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి 11 గ్రాముల MDMA డ్రగ్, ఓ కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. హైదరాబాద్‌లో యువత టార్గెట్‌గా అబ్దుల్ రెహమాన్, నరేందర్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు డీసీపీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 15 మంది ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.

హైదరబాద్‌తో పాటు పబ్ కల్చర్ ఉన్న ప్రాంతాల్లో యువత టార్గెట్‌గా నరేందర్, రెహమాన్‌ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. గోవా జైలులో ఉన్న డ్రగ్స్ కింగ్ ఫిన్ పైజల్ ఆదేశాలతో రెహమాన్ డ్రగ్స్ విక్రయిస్తున్నారని.. ఫైజల్‌ను పీటి వారెంట్‌పై హైదరాబాద్ కు తీసుకుని వస్తామని పేర్కొన్నారు డీసీపీ. రెహమాన్‌కు నైజీరియన్లతో సంబంధాలు ఉన్నట్టు తమ ఇన్వెస్టిగేషన్ లో తేలిందని..దీనిపై కూడా విచారణలో వాస్తవాలు బయటకు తీసుకొస్తామని అన్నారు. 

Tags:    

Similar News