శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో మరో ప్రమాదం

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో మరోసారి ప్రమాదం సంభవించింది. భారీ శబ్దంతో పేలుడు..

Update: 2020-09-02 13:34 GMT

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో మరోసారి ప్రమాదం సంభవించింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. కరెంట్ కేబుల్ పైనుంచి డీసీఎం వెళ్లడంతో ప్రమాదం సంభవించింది. దీంతో కాసేపు ప్లాంటులో మంటలు ఎగిసిపడ్డాయి. భారీ శబ్దంతో వ్యాపించిన మంటల ధాటికి అందులో పనిచేసే సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు ప్లాంటులో ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.

ఇక లాండ్ కు ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. ఇదిలావుంటే ఆగస్టు 22 న కూడా ప్లాంటులో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్లాంటులో 30 మంది సిబ్బంది ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించడంతో ఎక్కువ ప్రాణనష్టం జరగలేదు. అయితే దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను కనుక్కోవాలని కేసీఆర్ ఆదేశించారు.

Tags:    

Similar News