MLC Elections: ఇవాళ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు

MLC Elections: తెలంగాణ‌లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి.

Update: 2021-12-10 01:30 GMT

MLC Elections: ఇవాళ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు

MLC Elections: తెలంగాణ‌లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన మరో 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారులు ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14న ఫలితాలు వెలువడనున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో 37 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5వేల 326 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్‌కు సంబంధించి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద హెల్త్‌ డెస్క్‌, హెల్ప్‌ డెస్క్‌ అందుబాటులో ఉంచారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో ఒక స్థానానికి టీఆర్‌ఎస్‌ నుంచి దండె విఠల్‌, ఇండిపెండెంట్‌గా పుష్పరాణి పోటీలో ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు భానుప్రసాద్‌రావు, ఎల్. రమణతో పాటు ఇటీవల టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన రవీందర్‌సింగ్‌, మరో ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఖమ్మంలో ఒక స్థానానికి టీఆర్‌ఎస్‌ నుంచి తాతా మధు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావుతో పాటు స్వతంత్ర అభ్యర్థులు శ్రీనివాసరావు, సుధారాణి పోటీలో ఉన్నారు. ఇక మెదక్‌లో ఒక స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వంటేరు యాదవరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి నిర్మల, ఇండిపెండెంట్ మల్లారెడ్డి పోటీకి దిగుతున్నారు. నల్గొండలో ఒక స్థానానికి టీఆర్‌ఎస్‌ నుంచి ఎంసీ కోటిరెడ్డితో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. 

Tags:    

Similar News