Hyderabad: హైదరాబాద్ రోడ్డుపై సీఐని చేజ్ చేసి పట్టుకున్న ఏసీబీ.. అసలేం జరిగింది?

Hyderabad: నేరస్తులు లేదా దొంగలను పట్టుకొనేందుకు పోలీసులు ఛేజింగ్ చేస్తారు. కానీ, లంచం తీసుకున్న ఓ సీఐని ఏసీబీ అధికారులు సినిమాలో చూపించే విధంగా వెంటాడి పట్టుకున్నారు.

Update: 2024-06-14 06:27 GMT

Hyderabad: హైదరాబాద్ రోడ్డుపై సీఐని చేజ్ చేసి పట్టుకున్న ఏసీబీ.. అసలేం జరిగింది?

Hyderabad: నేరస్తులు లేదా దొంగలను పట్టుకొనేందుకు పోలీసులు ఛేజింగ్ చేస్తారు. కానీ, లంచం తీసుకున్న ఓ సీఐని ఏసీబీ అధికారులు సినిమాలో చూపించే విధంగా వెంటాడి పట్టుకున్నారు. ఈ ఘటన హైద్రాబాద్ లో జూన్ 13 సాయంత్రం జరిగింది.

అసలు కేసు ఏంటి?

సికింద్రాబాద్ అల్వాల్ ఫార్మా వ్యాపారి సీవీఎస్ సత్యప్రసాద్ బోయిన్ పల్లికి చెందిన కన్సల్టెంట్ మణిరంగస్వామి అయ్యర్ పై హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపార విస్తరణకు సలహాలిస్తానని మోసం చేశారని సత్యప్రసాద్ ..రంగస్వామిపై ఫిర్యాదులో చేశారు. ఈ కేసు నుండి తప్పించాలని సీసీఎస్ సీఐ సుధాకర్ ను కలిశారు మణిరంగస్వామి. ఇందుకు తనకు 15 లక్షల రూపాయాలు చెల్లించాలని వీరిద్దిరి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే అడ్వాన్స్ గా 5 లక్షలను సీఐ సుధాకర్ కు నిందితుడు ఇచ్చారని అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. మరో విడతగా మూడు లక్షలను జూన్ 13న ఇచ్చేందుకు రంగస్వామి అంగీకరించారని ఏసీబీ అధికారులు మీడియాకు వివరించారు.

సీసీఎస్ సీఐ సుధాకర్ ను ట్రాప్ చేసేందుకు ఏసీబీ పక్కా స్కెచ్

సీసీఎస్ సీఐ సుధాకర్ లంచం డిమాండ్ చేసిన విషయాన్ని మణిరంగస్వామి ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సుధాకర్ ను ట్రాప్ చేసేందుకు ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్ వేశారు. హైద్రాబాద్ బషీర్ బాగ్ సీసీఎస్ కార్యాలయం పార్కింగ్ వద్ద వాహనంలో ఉండాలని మణిరంగస్వామికి సీఐ సుధాకర్ సూచించారు. ఆ పరిసరాల్లోనే ఏసీబీ అధికారులు మాటు వేశారు. రంగస్వామి వద్ద నుండి తీసుకున్న నగదును సీఐ మూడు లక్షలను తన బ్యాగులో సర్దుకున్నాడు. అంతా ఏసీబీ అధికారుల ప్లాన్ ప్రకారంగా సాగింది. లంచం డబ్బులు తీసుకున్న సుధాకర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఏసీబీ అధికారులను చూసి పరిగెత్తిన సీఐ సుధాకర్

రంగస్వామి కారులోని నగదును బ్యాగులో సర్దుకుంటున్న సీఐ సుధాకర్ ఏసీబీ అధికారులను చూశారు. వెంటనే డబ్బున్న బ్యాగును వదిలేసి రోడ్డుపై పరుగెత్తారు. ఈ విషయాన్ని గమనించిన ఏసీబీ అధికారులు సీఐ సుధాకర్ ను ఛేజ్ చేశారు. సీసీఎస్ కార్యాలయానికి కొంతదూరంలోనే సుధాకర్ ను పట్టుకున్నారు. సుధాకర్ చేతులను ఏసీబీ అధికారులు పరీక్షిస్తే పాజిటివ్ గా వచ్చిందని ఏసీబీ అధికారులు తెలిపారు. మూడు లక్షల నగదును కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. సీఐని మేజిస్ట్రేట్ ముందు హజరుపరిస్తే రిమాండ్ విధించారు.

నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై సినీ తరహలో జరిగిన ఛేజింగ్ ను చూసిన వాహనదారులకు కొంతసేపు ఏం జరుగుతుందో తెలియక గందరగోళపడ్డారు. విషయం తెలిసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News