లంచం డబ్బుల రూపంలో తీసుకుంటే దొరికిపోతమేమి అనుకుంది ఓ మహిళా డ్రగ్స్ అధికారి. ఏదైనా కొత్తగా ఆలోచించాలి అనుకుంది. అందుకే లంచం డబ్బుల రూపంలో కాకుండా షాపింగ్ చేసిన నగలతో లంచాన్ని తీసుకోవాలని అనుకుంది. కానీ ఏసీబీ వేసిన పక్కా స్కెచ్ కి అడ్డంగా దొరికిపోయింది. ఇక వివరాల్లోకి వెళ్తే లింగంపల్లి లక్ష్మీరెడ్డి అనే మహిళ 15 ఏళ్లుగా బోయిన్‌పల్లిలో జనని వాలంటరీ పేరుతో బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహిస్తోంది. అయితే ఇటివల తనిఖిల నేపధ్యంలో లోపాలు ఉన్నాయని డీఐ లక్ష్మీ గుర్తించింది. దీనిపై కేసు నమోదు చేసిన డీఐ..బ్లండ్ బ్యాంక్‌ను సీజ్ చేయకుండా ఉండాలంటే తనకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
దీనితో చేసేది ఏమిలేకా లక్ష్మీరెడ్డి ఏసీబీని ఆశ్రయించింది. ఆనీశా అధికారులు ఆమెపై నిఘా పెట్టారు. ముందుగా లక్ష్మీరెడ్డి డ్రగ్స్ అధికారికి ఫోన్ చేసి అడిగినంత ఇస్తానని చెప్పింది. అయితే సదరు డ్రగ్స్ అధికారి నగదు రూపంలో కాకుండా బంగారు ఆభరణాల రూపంలో కావాలని ఆమెను కోరింది. ఈ నేపధ్యంలో అబిడ్స్‌లోని ఓ బంగారు దుకాణంలో లక్షా పది వేల రూపాయల విలువ చేసే బంగారు గొలుసు ఆభరణాలను ఎంచుకుంది డీఐ... ఇదే బంగారు గొలుసును మరుసటి రోజు తెచ్చి ఇస్తానని చెప్పి, డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ను అక్కడి నుండి పంపించేసింది లక్ష్మి రెడ్డి... ఆ మరసటి రోజు ఆభరణాలను ఇచ్చేందుకు లక్ష్మీరెడ్డి డ్రగ్స్ అధికారి ఇంటికి వెళ్ళింది. అక్కడ నగలు అందజేస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.