Bhadradri Kothagudem: కరెంటు బిల్లు చూసి మైండ్ బ్లాంక్.. ఒక్క నెలలో రూ.7లక్షలు బిల్లు
*భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో విద్యుత్ అధికారుల నిర్వాకం
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీ కాలనీకి చెందిన మాడిశెట్టి సంపత్ రేకుల ఇంటికి ఏకంగా 7లక్షల2వేల825 బిల్లు వచ్చింది. కేవలం మూడు గదులున్న ఇంట్లో మూడు బల్బులు, ఓ ఫ్యాను, టీవీ మాత్రమే ఉన్నప్పటికీ ఏకంగా 7లక్షల పైచిలుకు బిల్లు రావడంపై బాధఇతుడు సంపత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత బిల్లు రావడం ఏమిటని ప్రశ్నించినా విద్యుత్ అధికారులు సమాధారం చెప్పకపోవడంతో హైరానా చెందుతున్నారు.
గత నెల వరకు సగటున ప్రతినెలా కేవలం 400 వచ్చే బిల్లు మే ఒక్క నెలలో ఏకంగా 7లక్షలురావడం ఏమిటని బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు. తప్పుల తడకగా ఉన్న బిల్లులతోతమలాంటి వారెందో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారుల పనితీరుపై ఉన్నతస్థాయి అధికారులు దృష్టి సారించాలంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.