Telangana: లాక్‌డౌన్‌లో కేసులు @ 6,00,313

Telangana: లాక్‌డౌన్‌ ఆర్థిక దెబ్బ కొట్టినా.. ఆరోగ్యాలను మాత్రం కాపాడింది.

Update: 2021-06-20 14:30 GMT

Telangana: లాక్‌డౌన్‌లో కేసులు @ 6,00,313

Telangana: లాక్‌డౌన్‌ ఆర్థిక దెబ్బ కొట్టినా.. ఆరోగ్యాలను మాత్రం కాపాడింది. తెలంగాణలో మే 12 నుంచి జూన్‌ 19 వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంది. కరోనా రూల్స్‌ని పోలీసులు కఠినంగా అమలు చేశారు. అయితే ఈ 39 రోజుల్లో రాష్ట్రంలో 6లక్షల 313 మందిపై ఈ-పిట్టీ కేసులు, ఈ-చలాన్లు విధించినట్టు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. కర్ఫ్యూ రూల్స్ ఉల్లంఘించిన 4లక్షల 64వేల 70 మందిపై కేసులు బుక్కయ్యాయి. మాస్కులు ధరించలేదని 1లక్షా 2వేల 3వందల 46 మందిపై కేసు ఫైల్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా శుభాకార్యాలు చేసిన 7వేల 137 మందిపై కేసులు నమోదు చేశారు. 26వేల 7వందల 60 మందిపై బౌతిక దూరం పాటించలేదని ఈ-పిట్టీ కేసులు నమోదయ్యాయి.

వీరందరికీ నిబంధనల ప్రకారం కోర్టు నుంచి జరిమానాలు సెక్షన్లను బట్టి జైలు శిక్షలు సైతం విధించే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో పట్టుబడిన వాహనాలను ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వాహనదారులకు నిబంధనల మేరకు తిరిగి ఇస్తున్నారు.

Tags:    

Similar News