YouTube: యూట్యూబ్ లో డిస్‌లైక్ బటన్ మాయం?
YouTube: యూట్యూట్ మన జీవితంలో ఓ భాగమైంది. ఖాళీగా ఉంటే యూట్యూబ్ వీడియాలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాం.
YouTube: యూట్యూట్ మన జీవితంలో ఓ భాగమైంది. ఖాళీగా ఉంటే యూట్యూబ్ వీడియాలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. చిన్నా, పెద్దా తేడా లేకుండా యూట్యూబ్ కి దాసోహం అయిపోయాం. నచ్చితే ఓ లైక్, లేకుంటే డిస్ లైక్ కొట్టడం అలవాటైపోయింది. అయితే ఇదే కొందరికి వ్యసనంలా మారిందని, అకారణంగా డిస్ లైక్ లు కొడుతున్నట్లు యూట్యూబ్ కు కొన్ని కంప్లయింట్ లు చేరాయి. దీంతో యూట్యూబ్ కొత్తగా కొన్ని మార్పులను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది.
ఈ మేరకు భవిష్యత్తులో యూట్యూబ్‌లో కనిపించే వీడియోలకు డిస్‌లైక్‌ల సంఖ్య లేకుండా చేస్తుందని తెలుస్తోంది. అసలు డిస్‌లైక్ బటన్ లేకుండా చేసేందుకు పరీక్షలు చేస్తుందంట. ఈమేరకు ట్విటర్‌లో షేర్ చేసింది. రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ పరీక్షించనుంది. యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు ఈ ఫీచర్‌ను అమలు చేయనున్నారని సమాచారం.