Free Wifi: రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై.. చిన్న ట్రిక్‌తో హై స్పీడ్ డేటా.. ఎలా యాక్సెస్ చేయాలంటే..?
Free Wifi: మీరు రైల్వే స్టేషన్‌లో రోజుకు 30 నిమిషాల పాటు ఉచిత ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు. ఈ Wi-Fi ఇంటర్నెట్ 1Mbps వేగాన్ని అందిస్తుంది.
Free Wifi: ఇంటర్నెట్ నేడు మన జీవితంలో అంతర్భాగమైపోయింది. ఈ విషయం భారతీయ రైల్వేకు కూడా తెలుసు. దేశంలోని అన్ని రైల్వే స్టేషన్‌లలోని రైల్వే స్టేషన్‌లలో ఇంటర్నెట్‌ను అందించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. తన ప్రణాళికను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్న రైల్వేశాఖ ఇప్పటి వరకు 6108 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. విశేషమేమిటంటే ఏ ప్రయాణికుడైనా రైల్వే స్టేషన్‌లో అరగంట పాటు ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. ఈశాన్య భారతదేశం నుండి కాశ్మీర్ లోయ వరకు ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. రైల్వే కంపెనీ రైల్‌టెల్, రైల్‌వైర్ పేరుతో రైల్వే స్టేషన్‌లలో వై-ఫై ఇంటర్నెట్‌ను అందిస్తోంది. RailTel ఒక రిటైల్ బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్.
మీరు రైల్వే స్టేషన్‌లో రోజుకు 30 నిమిషాల పాటు ఉచిత ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు. ఈ Wi-Fi ఇంటర్నెట్ 1Mbps వేగాన్ని అందిస్తుంది. 30 నిమిషాల తర్వాత మీరు ఇంటర్నెట్‌ని ఉపయోగించడానికి కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రైల్‌వైర్ ఇంటర్నెట్ ప్యాక్‌లు 10 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. మీరు 34Mbps వేగంతో 5GB ఇంటర్నెట్ డేటాను ఉపయోగించుకోవచ్చు. దీాని వాలిడిటీ 24 గంటలు.
ఈ ఉచిత వై-ఫై సర్వీసెస్‌ను కేవలం రైల్వే స్టేషన్‌లో మాత్రమే ఉపయోగించుకోవాలి. రైలు ప్రయాణంలో రైల్‌వైర్ ఇంటర్నెట్ పనిచేయదు. మీరు railwire.co.inలో Railwire ఇంటర్నెట్ ప్లాన్‌ల గురించి సమాచారాన్ని పొందవచ్చు. Wi-Fi ప్లాన్ చెల్లింపు కోసం మీరు నెట్‌బ్యాంకింగ్, వాలెట్, క్రెడిట్ కార్డ్ మరియు UPI ఎంపికను పొందుతారు. అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్‌లో ఫ్రీ Wi-Fiని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
How To Connect Free Wifi..?
1. మీ ఫోన్ Wi-Fi సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి.
2. నెట్‌వర్క్‌లను సెర్చ్ చేయండి.
3. మీ బ్రౌజర్‌లో railwire.co.inకి వెళ్లండి.
4. 10 అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
5. మీరు మీ మొబైల్‌లో వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని అందుకుంటారు.
6. కనెక్షన్‌ని ఓకే చేయడానికి OTPని పాస్‌వర్డ్‌గా నమోదు చేయండి.
7. మీరు ఇప్పుడు Railwire ఉచిత Wi-Fi సర్వీస్‌కు కనెక్ట్ అవుతారు.