Xiaomi 14T Series: కిర్రాక్ ఫీచర్లు.. రెండు కొత్త ఫోన్లు ఎంట్రీ.. ధర తెలిస్తే గుండే ఝల్లుమంటుంది..!

Xiaomi 14T Series: షియోమీ 14T సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లు తీసుకురానుంది. వీటి ధరలు, ఫీచర్లు లీక్ అయ్యాయి.

Update: 2024-09-13 10:39 GMT

xiaomi 14t series 

Xiaomi 14T Series: చైనీస్ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమీ భారతీయ మార్కెట్‌లో Xiaomi 14T Seriesను తీసుకురానుంది. ఈ మేరకు గ్లోబల్ లాంచే తేదీని అధికారికంగా ప్రకటించింది. కంపెనీ ఈ సిరీస్‌లో Xiaomi 14T, Xiaomi 14T Pro ఉంటాయి. సెప్టెంబర్ 26న ఇవి అందుబాటులోకి రానున్నాయి. Xiaomi 13T సిరీస్‌కు సక్సెసర్‌గా కంపెనీ ఈ ఫోన్లను పరిచయం చేయనుంది. తాజాగా ఫోన్ రెండర్లు లీక్ అయ్యాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Xiaomi 14T-14T Pro Leaks
షియోమీ ఈ కొత్త ఫోన్ల అన్ని రెండర్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ ఫోటోలలో Xiaomi 14Tని నాలుగు కలర్ ఆప్షన్స్‌లో చూడొచ్చు. అలానే 14T Pro మూడు రంగులలో కనిపిస్తుంది. ఊహించినట్లుగా రెక్టాంగిల్ కెమెరా మాడ్యూల్‌లో కోకా-కోలా బ్రాండింగ్‌ను కూడా మనం చూడవచ్చు. రెండు మోడల్‌లు LED ఫ్లాష్‌తో ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. ఫోన్‌లో పెరిస్కోప్ జూమ్ లెన్స్ అందించలేదు.

లీకైన రెండర్‌లు 14T Pro స్ట్రెయిట్ డిజైన్‌కు ఆపోసిట్ 14Tలో కర్వ్డ్ ప్యానెల్‌ ఉంటుంది. అయితే రెండు ఫోన్‌లు ఫ్లాట్-ఎడ్జ్ ఛాసిస్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. లీక్ నుండి ఇతర వివరాలు 14T స్మార్ట్‌ఫోన్ ​​ 6.67-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మృదువైన 144Hz రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌‌కి సపోర్ట్ ఇస్తాయి.

ప్రాసెసర్ పరంగా ఫోన్‌లు MediaTek డైమెన్సిటీ చిప్‌సెట్‌లలో రన్ అవుతాయి. Xiaomi 14T డైమెన్సిటీ 8300-అల్ట్రాను ఉపయోగిస్తుంది. 14T ​​ప్రో టాప్-ఆఫ్-ది-లైన్ డైమెన్సిటీ 9300+ని ఉపయోగిస్తుంది. రెండు మోడల్‌లు 12GB RAMని కలిగి ఉన్నాయని, 14T 256GB స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉంది. అలానే 14T ​​ప్రో ఆ సామర్థ్యాన్ని 512GBకి రెట్టింపు చేస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం రెండు ఫోన్‌లలోని కెమెరా సిస్టమ్‌లో 50MP మెయిన్ సెన్సార్ ఉంటుంది. ప్యాకేజీని పూర్తి చేయడానికి 32MP సెల్ఫీ కెమెరాతో పాటు 50MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటుంది. రెండు ఫోన్‌లు IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ని కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

Xiaomi 14T - 14T Pro Price
ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు స్పెసిఫికేషన్‌లతో పాటు ధర కూడా లీక్ అయింది. వాటి ఆధారంగా Xiaomi 14T ప్రారంభ ధర €649 (సుమారు రూ. 60,376), 14T ​​Pro ధర €899 (సుమారు రూ. 83,635). అయితే అధికారిక ధరను షియోమీ ఇంకా ధృవీకరించలేదు.

Tags:    

Similar News