Aadhaar Card: జూన్ 14 తర్వాత పదేళ్ల ఆధార్ కార్డులు పనిచేయవా..!

Aadhaar Card: మనదేశంలో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన పత్రం. ఇది లేదంటే చాలా పనులు పెండింగ్లో పడుతాయి.

Update: 2024-05-28 07:11 GMT

Aadhaar Card: జూన్ 14 తర్వాత పదేళ్ల ఆధార్ కార్డులు పనిచేయవా..!

Aadhaar Card: మనదేశంలో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన పత్రం. ఇది లేదంటే చాలా పనులు పెండింగ్లో పడుతాయి. ఇది పనిచేయకుంటే మీకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయలేరు. మీ ఆధార్ పదేళ్ల కంటే పాతదైతే మీరు దానిని ఇప్పటివరకు అప్డేట్ చేయకుంటే జూన్ 14 తర్వాత నిరుపయోగంగా మారుతుంది. ఇలాంటి మెస్సేజ్లు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతున్నాయి. దీనిపై (యూఐడీఏఐ) యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చెబుతుందో ఈ రోజు తెలుసుకుందాం.

10 ఏళ్ల ఆధార్ కార్డులు పనిచేయవా..

నిజానికి 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఆధార్ కార్డులు మునుపటిలా పని చేస్తూనే ఉంటాయి. అయితే జూన్ 14 తేదీ అనేది ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేయడానికి యూఐడీఏఐ నిర్ణయించిన గడువు. అంటే ఈ లోపు మీ ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ మెస్సేజ్ను వక్రీకరించి చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేసి ఫార్వార్డ్ చేస్తున్నారు.

జూన్ 14 తర్వాత ఈ సేవలు అందుబాటులో ఉండవు

జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ గడువు ముగిసిన తర్వాత మీరు ఆధార్ కార్డ్‌లో చిరునామా, పేరు అప్‌డేట్ చేస్తే దాని కోసం రూ. 50 రుసుము చెల్లించాలి. మీరు మీ ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయాలనుకుంటే జూన్ 14లోపు ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా మీరు ఉచితంగా పొందవచ్చు.

ఫీజులు ఆఫ్‌లైన్‌లో వర్తిస్తాయి

ఆన్‌లైన్ సేవ కోసం మాత్రమే ఉచిత అప్డేట్ సౌకర్యం అందుబాటులో ఉంది. మీరు సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకుంటే అప్‌డేట్ చేయడానికి రూ.50 రుసుము చెల్లించాలి. మీ బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. మీరు ఆధార్‌లో ఏదైనా మార్పు చేయాలనుకుంటే జనవరి 14 లోపు ఇంట్లో కూర్చొని ఎటువంటి ఛార్జీ లేకుండా ఆన్‌లైన్‌లో చేయడం ఉత్తమం.


Tags:    

Similar News