Delete Facebook Account: మీరు ఫేస్‌బుక్‌ వాడడం లేదా.. ఇలా సులువుగా తొలగించండి..!

Delete Facebook Account: ఈ రోజుల్లో సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ విపరీతంగా ఉన్నాయి.

Update: 2024-03-10 16:00 GMT

Delete Facebook Account: మీరు ఫేస్‌బుక్‌ వాడడం లేదా.. ఇలా సులువుగా తొలగించండి..!

Delete Facebook Account: ఈ రోజుల్లో సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ విపరీతంగా ఉన్నాయి. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ ఇలా చాలా ఉన్నాయి. నేటి యువత ఎక్కువగా వీటిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇక ఫేస్‌బుక్‌ సంగతి వేరే చెప్పనక్కరలేదు. దాదాపు ప్రతి ఒక్కరికి ఫేస్‌బుక్‌ అకౌంట్ ఉంటుంది. మరికొందరికైతే రెండు, మూడు అకౌంట్‌లు ఉంటున్నాయి. ఇలా ఉండడం వల్ల తరచుగా కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో ఈ అకౌంట్‌ను ఎలా డిలిట్‌ చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

1. ముందుగా మీ కంప్యూటర్ లేదా మొబైల్ లో Facebookని ఓపెన్‌ చేయండి

2. పైన కుడి మూలలో ఉన్న మీ ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేయండి.

3. "సెట్టింగ్స్, గోప్యత" పై క్లిక్‌ చేయండి.

4. ఇందులో "సెట్టింగ్స్" పై క్లిక్ చేయండి.

5. తర్వాత "మీ Facebook సమాచారం" పై క్లిక్ చేయండి.

6. "ఇన్‌యాక్టివ్‌, డిలిట్‌" పై క్లిక్ చేయండి.

7. "మీ అకౌంట్ డిలిట్‌"పై క్లిక్ చేయండి.

8. పాస్‌వర్డ్‌ను మళ్లీ ఎంటర్‌ చేయమని అడుగుతుంది.

9. "మీ అకౌంట్ డిలిట్‌"పై మళ్లీ క్లిక్ చేయండి.

మీ అకౌంట్‌ను తొలగించడానికి Facebook మీకు 30 రోజుల సమయం ఇస్తుంది. ఈ వ్యవధిలో, మీరు మీ మనసు మార్చుకోవచ్చు. అవసరమైతే అకౌంట్‌ను తిరిగి వాడుకోవచ్చు. 30 రోజుల తర్వాత మీ అకౌంట్‌ పూర్తిగా డిలిట్‌ అవుతుంది. మీ అకౌంట్‌ను తొలగించే ముందు మీరు మీ పోస్ట్‌లు, ఫోటోలు, వీడియోలు, ఇతర డేటా మొత్తాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఇలా చేయండి.

1.మీ కంప్యూటర్ లేదా మొబైల్ పరికరంలో Facebookని ఓపెన్‌ చేయండి.

2. పైన కుడి మూలలో ఉన్న ప్రొఫైల్ ఫోటోపై క్లిక్ చేయండి.

3. "సెట్టింగ్‌లు, గోప్యత" ఎంచుకోండి.

4. "సెట్టింగ్స్" పై క్లిక్ చేయండి.

5. "మీ Facebook సమాచారం"పై క్లిక్ చేయండి.

5. "మీ Facebook డేటా కాపీని డౌన్‌లోడ్ చేయి" పై క్లిక్ చేయండి.

6. "స్టార్ట్ మై ఆర్కైవ్" పై క్లిక్ చేయండి.

7. అంతే ప్రాసెస్‌ పూర్తయినట్లే. మీ డేటా మొత్తం డౌన్‌లోడ్‌ అవుతుంది.

Tags:    

Similar News